రాజ పనస చెట్టు Malvaceae అనే కుటుంబం చెందినది. ఇది పనస జాతికి సమీప బంధువు. ఆంగ్లంలో డ్యురియన్ (Durian) గా పిలువబడే రాజ పనస యొక్క సాగు ఇండొనేషియా, మలేషియా మొదలగు ఆగ్నేయ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల రాజపనస సాగు కేరళ రాష్ట్రంలోనూ జరుగుచున్నది.
ఈ చెట్టు యొక్క పండు పరిమాణంలో పెద్దదిగా ఉండి పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. రాజపనస పండు లోపలి కండను పొట్టు వంటి ముళ్ళతో కూడిన బలీయమైన తొక్కుతో కప్పబడి ఉంటుంది. ఈ పండు 30 సెంటీమీటర్ల (12 అంగుళాలు) పొడవు, 15 సెంటీమీటర్ల (6 అంగుళాలు) అడ్డుకొలత వరకు పెరుగుతుంది. ఇది ఒకటి నుంచి మూడు కిలోగ్రాముల బరువు తూగుతుంది. దీని పండు దీర్ఘగోళాకారం నుంచి గోళాకారం మధ్యలో ఉంటుంది. పైన ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండ్లు వీటి జాతులను బట్టి లోపలి కండ రంగులో మార్పును కలిగి ఉంటాయి. పండు లోపలి కండ భాగం మాంసపు కండ వలె ఎరుపు నుంచి చామన చాయ వరకు, పసుపు నుంచి పాలిపోయిన పసుపు రంగు వరకు వివిధ రంగులను కలిగి ఉంటుంది.
రాజపనస పండులో ఎక్కువమొత్తంలో షుగర్, విటమిన్ సి, పొటాషియం, సెరొటోనెర్జిక్ ఎమినో యాసిడ్, ట్రిప్టోఫాన్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్లు ఉంటాయి [3]. మలేషియాలో రాజపనస ఆకులను, వేర్లను కషాయం కాచి జ్వరం వచ్చినప్పుడు శరీరానికి వ్రాస్తారు.
హైదరాబాద్ వంటి మెట్రోపొలిటాన్ నగరాల్లో రాజపనస కేజీ 750 రూపాయల ధర పలుకుచున్నది. అయితే రాజపనస వాసన కొందరు ఇష్టపడకపోవచ్చును. రాజపనస చాలా ఘాటు సువాసన వెదజల్లుతుంది. అందువలన ఆగ్నేయదేశాల్లోని హోటల్స్, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో రాజపనస నిషేధించబడింది.
|website=
(help) http://en.wikipedia.org/wiki/Durian