యుఫోర్బియేసి
(
Telugu
)
provided by wikipedia emerging languages
యుఫోర్బియేసి పుష్పించే మొక్కలలో ఒక కుటుంబము.
కుటుంబ లక్షణాలు
- ఎక్కువగా గుల్మాలు లేదా పొదలు.
- శాఖీయ భాగాలలో లేటెక్స్ ఉంటుంది.
- పత్రాలు లఘు పత్రాలు లేదా హస్తాకార సంయుక్త పత్రాలు, ఏకాంతరము, పుచ్ఛయుతము.
-
సయాథియం పుష్పవిన్యాసం.
- ఏకలింగ పుష్పము, అండకోశాధస్థితము.
- పరిపత్ర భాగాలు ఒకే వలయంలో అమరి ఉంటాయి.
- కేసరాలు ఒకటి నుండి అనేకము.
- త్రిఫలదళ, సంయుక్త ఊర్థ్వ అండాశయము.
- స్తంభ అండన్యాసము.
-
రెగ్మా ఫలము.
- విత్తనములు అంకురచ్ఛద యుతము. విత్తనముల బీజ రంధ్రాల వద్ద 'కారంకుల్' ఉంటుంది.
ఆర్ధిక ప్రాముఖ్యత
- ఆముదము గింజల నుండి నూనె లభిస్తుంది.
- హీవియా, మానిహాట్ ల లేటెక్స్ నుండి రబ్బరు లభిస్తుంది.
-
కర్ర పెండలము వేరు దుంపలను ఆహారముగా వాడతారు.
- అకాలిఫ, పాయిన్, కోడియం మొదలగు మొక్కలను తోటలలో అందానికి పెంచుతారు.
ముఖ్యమైన మొక్కలు
మూలాలు
- license
- cc-by-sa-3.0
- copyright
- వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు